Rajnath Singh Fires on Telangana Government : 'కేసీఆర్ సర్కార్ అవినీతి దిల్లీ వరకు వినిపిస్తోంది' - Rajnath Singh criticizes Telangana government
🎬 Watch Now: Feature Video
Published : Oct 16, 2023, 9:11 PM IST
Rajnath Singh Fires on Telangana Government : ఈరోజు సభల్లో ప్రజలను చూస్తుంటే.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అనిపిస్తోందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh) అన్నారు. అభివృద్ధి పేరుతో కేసీఆర్ తెలంగాణను వెనుకబడిన ప్రాంతంగా మార్చారని ఆరోపించారు. పదేళ్లుగా అధికారంలో ఉన్నా ఏం చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వనరులను దోచుకుని.. తెలంగాణను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా చేశారని దుయ్యబట్టారు. హైదరాబాద్ బండగ్‌పేటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
BJP Jana Garjana Sabha in Badangpet : కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇస్తుందని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. కానీ బీఆర్ఎస్ సర్కార్ సహకరించడం లేదని ఆరోపించారు. తెలంగాణలో అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ సర్కార్ అవినీతి దిల్లీ వరకు వినిపిస్తోందని విమర్శించారు. మొదట రాష్ట్రం అనే అభిప్రాయం ఉన్నవారిని ఇక్కడి ప్రజలు కోరుకున్నారని.. కానీ ఫ్యామిలీ ఫస్ట్ అనే వ్యక్తుల చేతిలో రాష్ట్రం ఉందని ధ్వజమెత్తారు.