కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కుప్పకూలుతుంది : రాజాసింగ్ - telangana latest news
🎬 Watch Now: Feature Video
Published : Dec 6, 2023, 2:04 PM IST
MLA Raja Singh Comments On Congress Govt : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలదొక్కుకోలేదని.. ఆరు నెలలు లేదా ఏడాది మాత్రమే ఉంటుందని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆ తర్వాత కుప్పకూలిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ చేసిన గుంతలు పూడ్చడానికే సమయం పడుతుందని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఇచ్చిందని మండిపడ్డారు. త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Goshamahal MLA Raja Singh Comments : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమానికి రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి అంబేడ్కర్ చిత్ర పటం వద్ద నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ అంబేడ్కర్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారని అన్నారు. కాంగ్రెస్ ఆయణ్ను గౌరవించలేదని విమర్శించారు. రాష్ట్రంలో రావణ రాజ్యం అంతమైందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజలను మోసం చేశారని అందుకే ఈ ఎన్నికల్లో ఓడించి ఫామ్‌హౌస్‌కు పంపించారని రాజాసింగ్ తెలిపారు.