బ్రిడ్జ్​పై​ పనులు చేస్తుండగా సడెన్​గా వచ్చిన రైలు.. నదిలోకి దూకిన కార్మికుడు.. ఆ తర్వాత.. - పట్టాలపై పనులు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన రైలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 5, 2023, 3:47 PM IST

Railway Worker Jumped From Bridge To River : బిహార్​లోని ఓ రైల్వే బ్రిడ్జ్​పై​ నుంచి నదిలోకి దూకాడు ఓ కార్మికుడు. పట్టాలపై పనులు చేస్తుండగా ఒక్కసారిగా రైలు రావడం వల్ల.. చేసేదేం లేక బాగ్​మతీ నదిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. సహర్సా జిల్లాలో ఈ ఘటన జరిగింది. కార్మికుడు నదిలోకి దూకడాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే అప్రమత్తమై అతడ్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఓ తాడు సహాయంతో కార్మికుడ్ని బయటకు తీసుకొచ్చారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుడ్ని అశోక్ కుమార్​గా గుర్తించారు. ​అనంతరం అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కార్మికుడి​ కాలుకు చిన్న గాయం అయినట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. అశోక్​ కుమార్​ ఓ ప్రైవేటు రైల్వే కాంట్రాక్టర్​ కింద పనిచేస్తున్నట్లు తెలిసింది. కానీ కాంట్రాక్టర్​కు సంబంధించిన వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదని రైల్వే ఇన్స్​స్పెక్టర్​ వందన కుమారి తెలిపారు

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.