PRATHIDWANI కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో ఎందుకు ఆలస్యం - Today prathidwani on employee issues
🎬 Watch Now: Feature Video
PRATHIDWANI క్రమబద్ధీకరణ కల నెరవేరేది ఎప్పుడంటూ... కాంట్రాక్టు ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. పాదయాత్రలు చేశారు. మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గోడు విన్న ప్రభుత్వం సానుకూలంగానే స్పందించినా... ప్రతిఫలం మాత్రం దక్కలేదు. అసలే ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో క్రమబద్ధీకరణ చేస్తే మరింత భారం తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దస్త్రాన్ని పక్కన పెట్టేసి... వచ్చే ఏడాది చూద్దామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు కాంట్రాక్ట్ ఉద్యోగుల కల నెరవేరేది ఎప్పుడు?.. వచ్చే ఏడాదైనా క్రమబద్ధీకరణ కొలిక్కి వస్తుందా..? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST