Prathidwani : ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా టీచర్ల బదిలీల ప్రక్రియ.. పరిష్కారమెలా..? - DSE
🎬 Watch Now: Feature Video
Published : Oct 7, 2023, 9:30 PM IST
Prathidwani : రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా మారింది. రోజుకో వివాదం, న్యాయపరమైన చిక్కులతో అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఒక్క అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా పరిస్థితి తయారైంది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల బదిలీలను ఈ నెల 19 వరకు నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా టీచర్ల లంచ్ మోషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మొత్తం మీద ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల అంశంలో ఈ వివాదాలన్నీ తొలిగేదెలా..? షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ ఏ విధంగా జరగాలి..? ఈ వివాదాలు, గందరగోళం పాఠశాల నిర్వహణ పైన, విద్యార్థుల చదువుల పైన, బోధన పైన ప్రభావం చూపకుండా ఉండాలంటే ఏం చేయాలి..? ప్రభుత్వం ఇప్పటికైనా ఏం చర్యలు తీసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది..? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ..