PRATIDWANI: అగ్నిప్రమాద విషాదాలకు అంతెక్కడ? ప్రాణాలు పోతున్నా పాఠాలు నేర్వరా..? - 8 killed in fire accident
🎬 Watch Now: Feature Video
Pratidwani: భాగ్యనగరంలో వరస అగ్ని ప్రమాదాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కాలాలతో సంబంధం లేకుండా... క్రమం తప్పకుండా ఎక్కడో చోట భారీ అగ్ని ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతోమంది గాయాలపాలు అవుతున్నారు. ఈ ప్రమాదాల పరంపరలో సికింద్రాబాద్ రూబీ హోటల్ ఘటన ఓ కొనసాగింపు మాత్రమే. ఈ వరస అగ్నిప్రమాద విషాదాలకు అంతెక్కడ? ప్రాణాలు నిలువుగా కాలి పోతున్నా పాఠాలు నేర్వరా..? అగ్నిమాపక, భవననిర్మాణ నిబంధనల అమలులో అలసత్వం, నిర్లక్ష్యం ఎందుకు? సికింద్రాబాద్ ఘటనకు బాధ్యులెవరు? ఈ అగ్నిగండం దాటేది ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST