Pratidwani : రియల్ మోసాలు... తక్షణ జాగ్రత్తలు - హైదరాబాద్లో రియల్రంగం
🎬 Watch Now: Feature Video
Realestate boom in hyderabad :హైదరాబాద్ నేడు విశ్వనగరంగా మారింది. భాగ్యనగరం అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతోంది. అదే విధంగా నేరాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో రియల్ రంగం ఎంత దూకుడు మీద ఉందో. అంతే తీవ్రస్థాయిలో మోసాలు కలవర పెడుతున్నాయి. భవిష్యత్ మీద కొండంత ఆశలతో.. భూమిపై పెట్టుబడి పెడుతున్న కష్టార్జితాన్ని మహా మాయగాళ్లు క్షణాల్లో కాజేస్తున్నారు . రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల విభాగంలో ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకుని వచ్చామని చెబుతున్నా.. ఈ భూక్రయ విక్రయాల్లో నేరాలు మాత్రం ఆగడం లేదు.
ఎవరి భూమి, ఎవరు ఎవరికి అమ్ముతున్నారో కూడా అంతు చిక్కని స్థాయిలో ఈ మోసాలు ఉంటున్నాయి. మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇళ్లు లేదా స్థలాలు కొనుగోళ్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం. భూమి కొనేముందు ఏ ఏ రికార్డులు పరిశీలించుకోవాలి. ఎంపిక నుంచి రిజిస్ట్రేషన్ మధ్య ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోతే అమ్మినవారికి బాధ్యత ఉండదా. మోసగాళ్ల బారిన పడి నష్టపోయిన వారేం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.