రూ.1.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం - ఎక్కడంటే? - గంజాయి స్మగ్లింగ్ కేసు
🎬 Watch Now: Feature Video
Published : Dec 8, 2023, 6:48 PM IST
Police Seized Ganja in Medchal : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 510 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. మల్కాజ్గిరి ఎస్వోటీ టీమ్ పక్కా సమాచారంతో 510 కిలోలు(102 ప్యాకెట్లు) గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, సరుకుతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు అదే వాహనంలో పలుమార్లు అక్రమంగా గంజాయి తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తేలింది.
వీరు హైదరాబాద్‌లో కూడా గంజాయి సరఫరా చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పట్టుబడ్డ సరుకు విలువ కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఉన్నట్లుగా పోలీసుల అంచనా వేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో మనోహర్, ప్రవీణ్ అనే వ్యక్తులు ఒడిశా నుంచి హర్యానా, హిస్సార్‌కు తరలిస్తున్నారని డీసీపీ వెల్లడించారు. ఈ అక్రమ రవాణాను మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు.