భద్రాద్రి కొత్తగూడెంలో భారీ మొత్తంలో పట్టుబడ్డ గంజాయి - ఇద్దరి అరెస్ట్
🎬 Watch Now: Feature Video
Police Seized Ganja In Bhadradri Kothagudem : ఒడిశా నుంచి మహారాష్ట్ర వెళ్తున్న కారులో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని అధికారులు స్వాదీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని కూనవరం రోడ్డు చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో 102 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు.. గంజాయి తరలిస్తున్న ఒక వ్యక్తిని, ఒక మహిళను అరెస్టు చేసి రూ.25 లక్షల విలువ గల గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాదారులు గంజాయి తరలించేందుకు అనేక విధాల మార్గాలను ఎంచుకుంటున్నారని అధికారులు తెలిపారు. గంజాయి పట్టుకొని రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నామని ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ తిరుపతి తెలిపారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం, మత్తు పదార్థాలు భారీగా పట్టుబడుతున్నాయి.