ప్రజలు ప్రశాంతంగా ఓటుహక్కు వినియోగించాలని నగరంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ - హైదరాబాద్‌లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
🎬 Watch Now: Feature Video
Published : Nov 3, 2023, 10:57 PM IST
Police Flag March in Hyderabad : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్‌ను నిర్వహించారు. టపాచబుత్ర, కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు బస్తీల్లో ఈ మార్చ్‌ను నిర్వహించారు. ఇందులో 150 మంది కేంద్ర పోలీసు బలగాలు పాల్గొన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు.
అందుకే ఈ ఫ్లాగ్ మార్చ్‌ను నిర్వహించినట్లు పేర్కొన్నారు. రౌడీ షీటర్లు నేరాలకు పాల్పడినట్లు సమాచారం అందితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వివిధ నియోజక వర్గాల్లో ఓటు హక్కుపై అవగాహన కోసం పోలీసులు బైక్ ర్యాలీలను నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఎన్నికల్లో ప్రలోభాలకు గురికాకుండా ఉండాలని పిలుపునిచ్చారు.