నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవిత కారును తనిఖీ చేసిన పోలీసులు - telangana elections 2023
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-11-2023/640-480-19965566-thumbnail-16x9-kavitha.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 7, 2023, 5:26 PM IST
Police Checked Kalvakuntla Kavitha Car : తెలంగాణ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. రాష్ట్రంలో అగ్రపార్టీల ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో మద్యం, నగదు, డబ్బును భారీగా సోదాలు చేస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి రాజకీయ నేతల వరకు పోలీసులు పటిష్ఠంగా తనిఖీ చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కవిత నిజామాబాద్లో పర్యటించడానికి వెళ్తున్న సమయంలో ..పోలీసులు ఆమె వాహనాన్ని ఆపారు. కవిత వాహనం నుంచి దిగి అధికారులకు సహకరించారు. అధికారులు వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేశారు.
Police Checking at Nizamabad : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు పోలీసులతో కలిసి నిజామాబాద్ నగరంలొ తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడటంతో పోలుసులు పార్టీ నేతల వాహనాలను భారీగా సోదా చేస్తున్నారు. రాజకీయ నాయకుల వాహనాలతో పాటు వారి అనుచర కార్లను కూడా తనిఖీలు చేస్తున్నారు. డబ్బు, మద్యం అక్రమ రవాణాకు అడ్డుపెట్టేందుకు వివిధ చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.