కంటతడి పెట్టిన మందకృష్ణ మాదిగను ఓదార్చిన ప్రధాని మోదీ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 11, 2023, 6:44 PM IST
PM Modi Consoled Crying Mandakrishna Madiga : సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో నిర్వహించిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేదికపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కంటతడి పెట్టుకున్నారు. కంటతడి పెట్టుకున్న మందకృష్ణ మాదిగను భుజం తట్టి ప్రధాని మోదీ ఓదార్చారు. గత 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం పాటుపడుతున్నారు.
మాదిగల ఉపకులాల సభకు వచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన మందకృష్ణ మాదిగ... ఈ సభకు ప్రధాని రావడం తాము ఊహించలేదని అన్నారు. ఈ సభకు విచ్చేసిన మోదీకి మాదిగలంతా చేతులెత్తి నమస్కరిస్తున్నామని తెలిపారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు కారుపై చేరుకున్నారు. సభకు చేరుకున్న అనంతరం సభకు విచ్చేసిన వారికి నమస్కారాలు తెలిపారు. ఈ సభలో ఎస్సీ వర్గీకరణ డిక్లేరేషన్ చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.