Photo Expo At Salar Jung Museum : యంగ్ ఫొటోగ్రాఫర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా.. సాలార్‌జంగ్ మ్యూజియంలో ఫొటో ఎగ్జిబిషన్ - Salar Jung Museum Photo Expo 2023
🎬 Watch Now: Feature Video
Published : Aug 28, 2023, 2:29 PM IST
Photo Expo At Salar Jung Museum : పోతురాజుల విన్యాసాలు.... బతుకమ్మ సంబురాలు....చిరుత చిందులు.... చిన్నపిల్లల చిరునవ్వులు... ప్రకృతి సోయగాలు....కనువిందు చేసే జలధారలు....గిరిజనుల జీవనం... తెలంగాణ సంస్కృతి... ఇలా ఒకటా రెండా....వందలాది ఫొటోలు వీక్షకులను కనువిందు చేస్తున్నాయి. అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూజియంలో అంతర్జాతీయ స్థాయి ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు.
Photo Expo At Salar Jung Museum Hyderabad : ఈ ఎగ్జిబిషన్లో.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్న దాదాపు 92 మంది ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలతో బంధించిన అద్భుతమైన 400 ఫొటోలు సందర్శకులను అలరిస్తున్నాయి. వీటితోపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు తీసిన వందకు పైగా ఫొటోలు ఫొటో ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. యువ ఫొటోగ్రాఫర్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో విద్యార్థుల ఫొటోలను ప్రదర్శిస్తున్నట్లు సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ ఇండియా కార్యదర్శి జనార్దన్ తెలిపారు. ఇందులో గిరిజనుల జీవన విధానం, పల్లె బతుకులు, పండుగలు, వేడుకలు, వారసత్వ కట్టడాలు ఇలా అనేక ఫొటోలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.