Perini dance performance : చిన్నారుల సిరిమువ్వల నాదంతో పులకరించిన శిల్పారామం - Perini dance performance by 100 kids in Hyderabad
🎬 Watch Now: Feature Video
Perini dance performance by 100 kids in Hyderabad : ఒకరా, ఇద్దరా కాదు కాదూ.. ఏకంగా వంద మంది చిన్నారుల సిరిమువ్వల నాదంతో శిల్పారామం వేదిక పులకించిపోయింది. చిట్టిపొట్టి చిన్నారులు కాళ్లకు గజ్జకట్టి చేసిన నాట్యం వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పారామంలో ప్రముఖ నాట్యగురువు నటరాజ రామకృష్ణకు పేరిణి నృత్య నీరాజనం సమర్పించారు. రామకృష్ణ పన్నెండో వర్ధంతి పురష్కరించుకొని శ్రీ మణిద్వీప ఆర్ట్స్ అకాడమీకి చెందిన 112 మంది చిన్నారులు నటరాజ రామకృష్ణకు పేరిణి నాట్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వినాయక గద్యం , మేళ ప్రాప్తి, బ్రహ్మగద్యం, సంధ్య తాండవం, పృథ్వి లింగ, దేవి స్తుతి, ఆకాశ లింగ, ఆనంద తాండవం, దేవి కైవారం, నృసింహావతారము, జుగల్బందీలు, తహణం ఇలా దాదాపు 11 అంశాలను నయన మనోహరంగా ప్రదర్శించి.. నాట్య ప్రియుల ప్రశంసలు అందుకున్నారు. నటరాజ రామకృష్ణ పేరిణి నాట్యానికి జీవం పోసిన మహానీయులు. ఆయనకు నాట్య నీరాజనం సమర్పించడం చాలా ఆనందంగా ఉందని నాట్యకళాకారులు సంతోషం వ్యక్తం చేశారు.