పెట్రోల్ బంక్ సిబ్బందిపై యువకుల అరాచకం.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు - బంక్ సిబ్బందిపై యువకులు దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 7, 2023, 11:41 AM IST

Attack on Petrol Bunk Staff: మద్యం మత్తులో ఉన్న ఓ ముగ్గురు యువకులు సోమవారం రాత్రి అరాచకం సృష్టించారు. వారి చేష్టలకు ఓ యువకుడు బలి కాగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. జన్వాడ ప్రాంతానికి చెందిన నరేశ్‌, మల్లేశ్‌, అభిషేక్‌ అనే ముగ్గురు యువకులు రాత్రి మద్యం సేవించి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో వారి వాహనంలో పెట్రోల్ కొట్టించడానికని రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని ఓ పెట్రోల్‌ బంక్​కు వెళ్లారు. పెట్రోల్ పోయించుకున్నాక కార్డు ఇచ్చారు. దాంతో స్వైపింగ్‌ యంత్రం లేదని.. డబ్బులే ఇవ్వాలంటూ అక్కడ పని చేస్తున్న సంజయ్​ కోరాడు.

దాంతో ఆగ్రహానికి గురైన యువకులు సంజయ్​పై దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దుల వర్షం కురిపించారు. అడ్డుకునేందుకు వచ్చిన చోటుపైనా విరుచుకుపడ్డారు. తలపై బలంగా కొట్టడంతో సంజయ్​ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందగా.. మరో వ్యక్తి చోటు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ముగ్గురు గతంలోనూ చోరీ, అత్యాచారం కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.