తలపై చెరుకు గడలతో 14కి.మీ సైక్లింగ్- కూతురిపై ప్రేమతో పెద్దాయన సాహసం - చెరకుతో సైకిల్ తొక్కిన వృద్ధుడు
🎬 Watch Now: Feature Video
Published : Jan 14, 2024, 6:22 PM IST
Old Man Rides Bicycle Viral Video : తలపై చెరుకు గడలతో 14 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు ఓ వృద్ధుడు. సంక్రాంతి పండుగ కానుకగా తన కుమార్తెకు చెరుకు గడలు ఇచ్చేందుకు ఈ సాహసం చేశారు తమిళనాడు పూదుకొట్టైకు చెందిన చెల్లాదురై. ముందుగా చెరుకు గడలు అన్నింటినీ కట్ట కట్టారు. కూతురి కోసం మరికొన్ని వస్తువులను సంచుల్లో పెట్టి, వాటిని సైకిల్ క్యారేజ్‌కు అమర్చారు. ప్రయాణం సాఫీగా సాగాలని సైకిల్‌కు పూజ చేశారు. చెరుకు గడల కట్టను తలపై జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ సైకిల్ ఎక్కారు. సైకిల్‌పై దూసుకెళ్తున్న పెద్దాయనను చూసి ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు ఆశ్చర్యపోయారు. కొందరు బైక్స్‌పై పక్కనే ప్రయాణిస్తూ, ఆయనను ఉత్సాహపరిచారు.
సైకిల్‌పై 5000 కిలోమీటర్లు - వృద్ధుడి సాహసం
5000 KM Cycling in 100 Days : ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే వయసు అడ్డంకి కాదని నిరూపించారు ఓ వృద్ధుడు. 63 ఏళ్ల వయసులో 5000 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. 100 రోజుల్లోనే ఈ ఘనతను అందుకున్నారు. ఆ వీడియో చూడాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.