Nizamabad MP Arvind Fires on Congress Party : రేవంత్ రెడ్డికి.. కర్ణాటక నుంచి తొలి విడతగా రూ.50 కోట్లు : ఎంపీ ధర్మపురి అర్వింద్ - జగిత్యాల తాజా న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Oct 13, 2023, 5:29 PM IST
Nizamabad MP Arvind Fires on Congress Party : రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ నుంచి కోట్ల రూపాయలు వస్తున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కుమార్ ఆరోపించారు. తొలి విడతగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లారీల్లో రూ.50 కోట్ల ధనాన్ని తరలించారని ఎంపీ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఏర్పాటు చేసిన పసుపు రైతుల కృతజ్ఞత సభకు వెళ్తున్న అర్వింద్ వాహనాన్ని జిల్లా సరిహద్దు గండి హనుమాన్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. గతంలో రేవంత్ రెడ్డి డబ్బులు సంచుల్లో తరలిస్తే, ఇప్పుడు లారీల్లో తరలిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇరు పార్టీలు ఒకటేనని.. వారి హయాంలో దోపీడీలు తప్ప అభివృద్ధి కనబడదని విమర్శించారు. తెలంగాణ సమాజం.. తమ పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోదీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు.