Nizamabad IT Hub Drone Visuals : నేడు నిజామాబాద్ ఐటీ హబ్ ప్రారంభోత్సవం.. డ్రోన్ విజువల్స్ చూస్తే వావ్ అనాల్సిందే.. - తెలంగాణ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-08-2023/640-480-19215905-861-19215905-1691505049021.jpg)
Nizamabad IT Hub Drone Visuals : రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో ఐటీ హబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా నిజామాబాద్‌లో నిర్మించిన ఐటీ హబ్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ లాంఛనంగా ఈ ఐటీ హబ్‌ను ప్రారంభించనున్నారు. ఈ ఐటీ హబ్‌కు సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
మంత్రి కేటీఆర్ నేడు నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. అందులో భాగంగా ఐటీ టవర్, న్యాక్, మున్సిపల్ నూతన భవనంతో పాటు మినీ ట్యాంక్‌బండ్, వైకుంఠ దామాలను ప్రారంభించనున్నారు. కార్యక్రమాల అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. దీంతో సభా ప్రాంగణ ఏర్పాట్లను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా పరిశీలించారు. బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. నగర ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.