BRS leader Srihari Rao joined Congress : 'నిర్మల్' పై కాంగ్రెస్ ఫోకస్.. పార్టీలోకి మరో బీఆర్‌ఎస్ నాయకుడు - సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి విమర్శలు
🎬 Watch Now: Feature Video
Nirmal BRS Leaders joined Congress : కేసీఆర్ మోసాన్ని భరించే ఓపిక రాష్ట్ర ప్రజలకు లేదని.. సమాజం తిరగబడే సమయం వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్మల్‌కు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు శ్రీహరిరావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. పార్టీలోకి వచ్చిన వారి అందరికి సముచిత గౌరవం, స్థానం దక్కుతుందని వివరించారు. రాబోయే ఎన్నికల్లో కొడంగల్‌లతో పాటు నిర్మల్ నియోజకవర్గాన్ని ప్రాధాన్యంలోకి తీసుకుంటామని వెళ్లడించారు. ఏ గ్రామాల్లో డబుల్ బ్రెడ్ రూం ఇల్లు కట్టించారో ఆ గ్రామాల్లో బీఆర్‌ఎస్ ఓట్లు అడగాలని.. ఇందిరమ్మ ఇల్లు కట్టిన ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందన్నారు. నిర్మల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇందుకు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. నిర్మల్ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు 8 స్థానాలు గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.