New Queue Complex at Shirdi Sai baba Temple : షిర్డీకి నూతన క్యూ కాంప్లెక్స్.. కష్టాలు తీరాయని భక్తుల హర్షం

By ETV Bharat Telangana Team

Published : Oct 30, 2023, 11:55 AM IST

thumbnail

New Darshan Queue Complex at Shirdi Sai baba Temple : మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి ఏటా దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. గతంలో ఉన్న క్యూలైన్లలో సాయిబాబాను దర్శించుకోవడాని భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. షిర్డీ సాయిబాబా సంస్థాన్ తరపున దాదాపు 110 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన దర్శనం క్యూ కాంప్లెక్స్​ను ఈ నెల 26వ తేదీన నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఏళ్ల తరబడి పడుతున్న కష్టాల నుంచి విముక్తి లభించిందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ దర్శన లైన్ నిర్మాణ వైశాల్యం 2 లక్షల 61 వేల 920 చదరపు అడుగులు.

దర్శనం క్యూ కాంప్లెక్స్​లో 10 వేల మందికి పైగా కూర్చునే సామర్ధ్యంతో వెయిటింగ్ హాల్​ను నిర్మించారు. వెయిటింగ్ హాల్​లో టాయిలెట్లు, బుకింగ్ కౌంటర్లు, ప్రసాదం కౌంటర్లు, ఇన్ఫర్మేషన్ సెంటర్లు కూడ ఏర్పాటు చేశారు. భక్తులు మొబైల్, పాదరక్షలు భద్రపర్చేందుకు 14,538 లాకర్లను ఏర్పాటు చేశారు. వికలాంగులు, వారి సంరక్షకులకు ప్రత్యేక సౌకర్యాలు కూడ ఏర్పాటు చేశారు. నాలుగేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ షిర్డీలో పర్యటించడం ఇది రెండో సారి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.