Nara Bhuvaneshwari Reacts on Chandrababu Arrest బాధలు చెప్పుకోడానికి దుర్గమ్మ సన్నిధికి వచ్చా.. చంద్రబాబు పోరాటం కుటుంబం కోసం కాదు: నారా భువనేశ్వరి - ఏపీ నారా భువనేశ్వరి
🎬 Watch Now: Feature Video
Published : Sep 9, 2023, 3:52 PM IST
Nara Bhuvaneshwari Reacts on Chandrababu Arrest: రాష్ట్ర ప్రజల స్వేచ్ఛ కోసం... హక్కు కోసం తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తోన్న పోరాటానికి ప్రజలంతా చేయిచేయి కలిపి అండగా నిలవాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) అన్నారు. ఒక బిడ్డకు మనసు బాగోలేనప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తారని... తాను కూడా తన బాధలు చెప్పుకోడానికి దుర్గమ్మ సన్నిధికి వచ్చానని అన్నారు. చంద్రబాబును అరెస్టు(Chandrababu Arrest) చేసి నంద్యాల నుంచి విజయవాడ తీసుకొస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న భువనేశ్వరి హైదరాబాద్ నుంచి తన సోదరుడు నందమూరి రామకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు మార్గంలో విజయవాడ వచ్చారు. నేరుగా ఇంద్రకీలాద్రికి(Indrakeeladri Temple) చేరుకుని దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులకు పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబును రక్షించమని జగన్మాతను వేడుకున్నట్లు నారా భువనేశ్వరి వెల్లడించారు. చంద్రబాబుకు మనోధైర్యం కల్పించాల్సిందిగా కోరానని తెలిపారు. చంద్రబాబు చేస్తోన్న పోరాటం తన కుటుంబం కోసం కాదని.... యావత్తు రాష్ట్ర ప్రజల కోసమని అన్నారు. చంద్రబాబు చేసే పోరాటం దిగ్విజయం కావాలని తాను దుర్గమ్మను ప్రార్ధించానని... ఇది ప్రజలందరి హక్కుగా భావించాలని అంటూ జైదుర్గమ్మ, జైహింద్, జై అమరావతి అని నినదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని నారా భువనేశ్వరి ఆరోపించారు.