నాగార్జునసాగర్ పోస్ట్ ఆఫీస్‌లో పోయింది రూ.20 లక్షలు కాదు 40 లక్షలకు పైనే - నాగార్జున సాగర్ పోస్టాఫీసు మోసం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2023, 4:47 PM IST

Nagarjuna Sagar Post Office Fraud Update : నాగార్జునసాగర్​లో ఫైలాన్ కాలనీలో ఉన్న పోస్ట్​ఆఫీస్ కార్యాలయంలో ఖాతాదారుల ఖాతాల్లో రూ.40 లక్షలు మాయమైందని అధికారులు గుర్తించారు. నిన్న ఖాతాదారుల ఖాతాల్లో నగదు మాయం అయినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోస్టు ఆఫీస్​లో సబ్​పోస్ట్ మాస్టర్​గా పని చేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తి అక్కడి ఖాతాదారుల ఖాతాల్లో సుమారు రూ.20లక్షల నగదును పక్క దారి పట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ డిపార్ట్​మెంటల్​ ఎంక్వయిరీ కోసం దేవరకొండ పోస్టల్ ఇన్​స్పెక్టర్​ మధుసూదన్ ఆధ్వర్యంలో మిగతా ఖాతాదారుల ఖాతాల్లో నగదును సరిచూస్తున్నారు.

Sub Postmaster Fraud in Post Office : ఈ సందర్భంగా విచారణ అధికారి మధుసూదన్ మాట్లాడారు. ఇప్పటివరకు వివిధ ఖాతాదారుల ఖాతాల్లోంచి రూ.40 లక్షలు మాయమైనట్లు నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. ఇంకా మిగతా ఖాతాదారుల ఖాతాల్లోంచి కూడా నగదు మాయమైనట్లు, వాటిపై ఎంక్వయిరీ చేయాల్సి ఉందని అన్నారు. పోస్టు ఆఫీస్​ ఖాతాదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. ఖాతాదారుల నగదు ఎక్కడికి పోదని అందరూ ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.