MP Laxman Clarifies on BJP First List : "ఎలాంటి అభ్యర్థుల జాబితా ప్రకటించలేదు.. అదంతా ఫేక్ ప్రచారం" - List of BJP MLA Candidates

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2023, 9:16 PM IST

MP Laxman Clarifies on BJP First List : తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పదకొండు మందితో కూడిన అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించినట్లు.. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోందని.. అదంతా అవాస్తవమని బీజేపీ నేత లక్ష్మణ్ స్పష్టం చేశారు. బీజేపీ ఫేక్ లెటర్ ప్యాడ్​పై అభ్యర్థుల పేర్లను చేర్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 

TS BJP Latest News : జాతీయ నాయకత్వం ఎటువంటి అభ్యర్థుల జాబితాను నిర్ణయించలేదని.. ఉద్దేశపూర్వకంగానే వదంతులను వ్యాపింపజేస్తున్నారని లక్ష్మణ్ స్పష్టం చేశారు. నిన్న జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో.. మధ్యప్రదేశ్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మాత్రమే చర్చ జరిగిందని స్పష్టం చేశారు. తెలంగాణ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎటువంటి చర్చ జరగలేదని తెలిపారు. కాంగ్రెస్​కి సమదూరాన్ని పాటిస్తున్నామని చెబుతున్న బీఆర్​ఎస్​.. ఎందుకు కేంద్ర ప్రభుత్వ బిల్లులను అడ్డుకుంటోందని విమర్శించారు. బీఆర్​ఎస్​, బీజేపీ ఒక్కటేనని దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్.. మైండ్ గేమ్ ఆడుతోందని లక్ష్మణ్ అభివర్ణించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.