బంగారు తెలంగాణ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేశారు - బీజేపీతోనే అవినీతి రహిత పాలన : ఎంపీ అర్వింద్ - తెలంగాణ ఎన్నికలు 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 17, 2023, 7:06 PM IST
MP Arvind Election Campaign at Nizamabad : నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ బీసీకి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా రామడుగులో బీజేపీ అభ్యర్థి దినేష్ కులాచారికి మద్దతుగా ఎంపీ అర్వింద్ ప్రచారంలో పాల్గొని.. అధికార పార్టీని ఉద్దేశిస్తూ మాట్లాడారు. సీఎం కేసీఆర్ పదేళ్ల నుంచి బంగారు తెలంగాణ పేరుతో ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు.
ప్రజలను ఉద్దేశిస్తూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వచ్చాయా, కొత్త రేషన్ కార్డు ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణలో యువతను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు కాకుండా దొరలకు టికెట్ ఇచ్చారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ నాయకుడైన డి.శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు. కేవలం బీసీలకు రాజ్యాధికారం రావద్దనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని ఆరోపించారు. బీజేపీతోనే అవినీతి రహిత పాలన కొనసాగుతుందని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించారు.