MP Aravind on Turmeric Board : "పార్టీలకు అతీతంగా పసుపు బోర్డు ప్రకటనపై ఆనందిస్తున్నారు" - mp aravind on modi meet to be held in nizamabad
🎬 Watch Now: Feature Video


Published : Oct 2, 2023, 3:43 PM IST
MP Aravind on Turmeric Board in Nizamabad : రాష్ట్ర రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారని ఎంపీ అర్వింద్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలను ఒప్పించి పసుపు రైతుల చిరకాల కోరికను సాధించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన... పసుపు రైతుల కోసం ఎంతవరకైనా వెళ్తాం అని నరేంద్ర మోదీ అనడం చాలా సంతోషం అన్నారు.
పసుపు బోర్డును తీసుకురావడానికి మంత్రులను అనేక సార్లు కలిశానని తెలిపారు. పార్టీలకు అతీతంగా పసుపు బోర్డు విషయంలో అందరు ఆనందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల పసుపు రైతుల కలను నరేంద్ర మోదీ పాలమూరు సభ ద్వారా నిజం చేశారని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఏ పరిశ్రమ పెట్టాలన్నా ఎమ్మెల్సీ కవిత భాగస్వామ్యం అడుగుతున్నారని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా పసుపు పండించే ప్రతి రైతు శనివారం నిజామాబాద్ జిల్లాలో జరిగే ప్రధాని పాల్గొనే సభను దిగ్విజయం చేయాలని కోరారు.