వృద్ధురాలిని ఈడ్చుకుంటూ లాక్కెళ్లిన పోలీసులు - మహిళను లాక్కెల్లిన పోలీసులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 8, 2023, 10:54 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

మధ్యప్రదేశ్​ పోలీసులు ఓ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించారు. కాలు పట్టుకున్న ఆ వృద్ధురాలని వదలకుండా పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి వారి వాహనం ఎక్కించారు. ఈ ఘటన మురౌనా జిల్లాలోని మాతా బసయ్య పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. ఆ మహిళ కుమారుడు సాహిబ్​ సింగ్​పై తన సొంత సోదరే ఆర్థిక లావాదేవీల విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సాహిబ్​ కోసం పోలీసులు ఇంటికి వచ్చారు. అయితే పోలీసుల నుంచి తన కుమారుడ్ని కాపాడుకోవడం కోసం ఆ వృద్ధురాలు అలా చేసినట్లు స్థానికులు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో స్థానికంగా వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.