Viral Video : పగప్రతీకారం మనుషులకే కాదు.. కోతులకూ ఉంటాయ్..! - తోటి కోతి మృతికి కారణమైన వారిపై వానరాల దాడి
🎬 Watch Now: Feature Video
Viral Video : సాధారణంగా ఆత్మీయుల చావుకు ఎవరైనా కారణమని తెలిస్తే వారితో గొడవకు దిగడం.. దాడి చేయడం వంటివి చూస్తుంటాం. అదే జంతువుల విషయానికి వస్తే ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా వింటుంటాం.. చూస్తుంటాం. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఇలాంటి ఓ దృశ్యమే కనిపించింది. అప్పటి వరకు తమతో కలిసి చిందులేసి, ఆటలాడిన తమ తోటి వానరం మృతికి కారణంగా భావిస్తూ ఓ ఔషధ దుకాణ నిర్వాహకుడిపై దాడి చేశాయి.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ఓ ఔషధ దుకాణం లోనికి ఓ కోతి వచ్చే ప్రయత్నం చేయగా.. ఆ దుకాణ నిర్వాహకుడు ద్వారం మూసివేయబోయాడు. ఈ క్రమంలో కోతి అందులో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయింది. ఇది గమనించిన మిగతా వానరాలు.. తమ తోటి కోతి మృతికి కారణమైన వారిపై దాడి చేశాయి. ఈ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. కోపతాపాలు, పగలు, ప్రతీకారాలు మనుషులకే కాదు.. జంతువులకూ ఉంటాయని కామెంట్ చేస్తున్నారు.