టింగ్ టింగ్ అంటూ మెసేజ్.. ఫ్రీగా డబ్బులు.. వందలు.. వేలు కాదు ఏకంగా లక్ష! - డబ్బులు అందరకీ వేయాలని ఆశిస్తున్న గ్రామస్థులు
🎬 Watch Now: Feature Video
Published : Aug 28, 2023, 10:35 AM IST
Money Deposits into Common People Bank Accounts in Eturnagaram : ములుగు జిల్లా ఏటూరునాగారంలో విచిత్రం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఓ వీధిలో సుమారు 50 మందికి పైగా ఖాతాదారుల్లో రెండ్రోజులుగా అకస్మాత్తుగా నగదు జమ అవుతున్నాయి. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ఎస్బీఐ(SBI) బ్యాంక్ అకౌంట్ ఉన్నవారితో పాటు.. ఇతర బ్యాంక్ ఖాతాల్లో కూడా నగదు జమ కావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. నగదు ఖాతాల్లో పడిన వెంటనే కొంతమంది విత్ డ్రా(Money Withdraw) చేసుకున్నారు. అసలు ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం ఎవరికీ అర్థం కాక అయోమయంలో ఉన్నారు.
Money in Common People Bank Accounts in Eturnagaram : ఆదివారం రోజున బ్యాంక్ సెలవు దినం కావడంతో పూర్తి సమాచారం తెలియలేదు. గ్రామంలో గుంపులుగా ఒక దగ్గర చేరుకొని చర్చించుకుంటున్నారు. కొంతమంది తమ అకౌంట్లో కూడా డబ్బు క్రెడిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. కొంతమంది మాత్రం తునికాకు డబ్బులు పడుతున్నాయని అంటున్నారు. దీంతో అందరూ తమ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి మిని ఏటీఎంల వద్దకు పరుగులు తీస్తున్నారు. మరికొంత మంది తమ సెల్ ఫోన్లో బ్యాలెన్స్ చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఏటూరునాగారం అంతటా ఈ సమాచారం హాట్ టాపిక్‌గా మారింది.