Mohammad Azharuddin Vs Vishnuvardhan Reddy : అజారుద్దీన్ జూబ్లీహిల్స్ పర్యటనలో ఉద్రిక్తత.. నువ్వానేనా అనేంతలా - అజారుద్దీన్ Vs విష్ణువర్ధన్‌రెడ్డి
🎬 Watch Now: Feature Video
Mohammad Azharuddin Vs Vishnuvardhan Reddy : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజవర్గంలో క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో అజారుద్దీన్ పర్యటించడంతో ఆగ్రహించిన ఆయన వర్గీయులు అడ్డుకున్నారు.
రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్హిల్స్లో విష్ణువర్ధన్‌రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో వీరువురి అనుచరుల మధ్య బాహాబాహీగానే ఒకరినొకరు తోసుకున్నారు. అందులో మహిళలు సైతం తిరగబడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. వారిని నిలువరించిన ఒకరిని ఒకరు నెట్టుకుంటూ కొట్లాడుకున్నారు. అయితే ముందుగానే అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని స్థానిక కార్యకర్తలతో చాయ్ పే చర్చ నిర్వహించాలనుకుని.. రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ చౌరస్తాలో సమావేశం ఏర్పాటు చేసేందుకు ర్యాలీగా అజారుద్దీన్ వచ్చారు. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులు ఆపడంతో.. పోలీసులు వారిని చెదరగొట్టారు. దీంతో పర్యటన ముగించుకుని వెళ్లారా లేదా అనేది తెలియాల్సి ఉంది.