MLC Kavitha Visit SaiChand Family : సాయిచంద్‌ను తలచుకుని కంటతడి పెట్టిన ఎమ్మెల్సీ కవిత - mlc kavitha press meet
🎬 Watch Now: Feature Video

MLC Kavitha Visited Sai Chan Family : ఇటీవల గుండెపోటుతో మరణించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ స్వగృహానికి వెళ్లి.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. సాయిచంద్ భార్య రజనీని ఓదార్చే క్రమంలో కవిత సైతం కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా సాయిచంద్ తెలంగాణ ఉద్యమం నుంచి.. చనిపోయే వరకు నిరంతరం ముఖ్యమంత్రి వెంటే ఉన్నారని కవిత గుర్తు చేసుకున్నారు. తన పాటలతో ఎంతో మందిని కదిలించాడని.. శ్రీకాంతాచారిపై పాట పాడుతూ తనకు మొట్టమొదటిసారిగా పరిచయమయ్యాడని తెలిపారు. ఇంత చిన్న వయసులోనే మరణించడం బాధాకరమని.. సాయిచంద్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవితతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు విఠల్, గీత కార్మికుల సంస్థ ఛైర్మన్ పల్లె రవికుమార్ తదితరులు ఉన్నారు.