MLC Chairman Gutha Fires on BJP : కాంగ్రెస్, బీజేపీ కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మొద్దు: గుత్తా - Telangana latest news
🎬 Watch Now: Feature Video
Published : Sep 19, 2023, 3:03 PM IST
MLC Chairman Gutha Sukender Reddy Fires on BJP : పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ పచ్చి అబద్దాలు మాట్లాడారని.. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని మరోసారి విషం చిమ్ముతున్నారని విమర్శించారు. బీజేపీ పతనం ప్రారంభమైందని.. అందుకే మహిళ రిజర్వేషన్ అంటూ హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. మోదీకి మహిళల పట్ల ప్రేమ, గౌరవం లేదని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రక్తం ఏరులై పారిందని మోదీ మాట్లాడటం సరికాదన్నారు. ప్రజలు ఎవ్వరూ బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతుందని వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీ సమావేశాల్లో ప్రజలను మభ్యపెట్టేలా ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలన్ని ఉత్తివే అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రాంతాల్లో ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్నారు. తెలంగాణను దోచుకోవడానికే ఈ స్కీంలు అని గుత్తా ఆరోపించారు.