MLA Raghunandan Rao Latest Comments : రంగులు వెలిసిపోయినా.. పేదవానికి ఇళ్లు రావట్లేదు! - Raghunandan Rao comments on kcr

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 24, 2023, 7:48 PM IST

Raghunandan Rao Speech about Double Bed Room : ఆగస్టు 30లోపు అర్హులైన వారికి డబుల్​ బెడ్​రూం ఇళ్లని ఇవ్వాలని..  అలా జరగకపోతే బీజేపీ ఆధ్వర్యంలో లబ్ధిదారులందరిని నిర్మించిన డబుల్​ బెడ్​రూంల్లోకి పంపిస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని కోరుతూ చేపట్టిన ధర్నాకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డబుల్​ బెడ్​రూంలు ఇప్పటికే నిర్మించి 5 సంవత్సరాలు అవుతుందని.. లీకేజ్​లు వస్తున్నాయని అన్నారు. కనీస సౌకర్యాలు నాశనం అవుతున్నాయని ఆరోపించారు. ఆ ఇళ్లు అన్నింటికి రెండు, మూడు సార్లు రంగులు వేశారని విమర్శించారు. రంగులు వెలసిపోయినా.. పేదవారికి ఇళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ అసెంబ్లీలో గృహలక్ష్మీ పథకం కింద ప్రతి పేదవారికి రూ.3లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తారన్న విషయం గుర్తు చేశారు. ఆ నగదును వెంటనే మంజూరు చేయాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో 12 శాతం ఉన్న గిరిజనులకు గిరిజన బంధు ప్రకటించి.. రూ.10లక్షలు ఇవ్వాలని సూచించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.