MLA Raghunandan Rao Comments on BRS : 'బార్లు, బీర్లు, గంజాయిని అడ్డుపెట్టుకొని.. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని చూస్తుంది' - దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Aug 26, 2023, 12:43 PM IST
MLA Raghunandan Rao Comments on BRS : బెల్ట్ షాపులు, గంజాయి, డ్రగ్స్ రహిత ఎల్బీనగర్ కోసం బీజేపీ నాయకుడు సామ రంగారెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. 48 గంటల పాటు కొనసాగిన ఈ నిరసనకు దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు సంఘీభావం తెలిపారు. సామ రంగారెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఎల్బీనగర్లో పోలీసుల చేతిలో గిరిజన మహిళకు జరిగిన ఘటన మర్చిపోకముందే.. నందనవనంలో దళిత మైనర్ బాలికపై సామూహిక హత్యాచారం జరగడం చాలా బాధాకరమన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని.. దళిత మహిళకు న్యాయం జరగాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే మహిళలపై దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. బార్లు, బీర్లు, గంజాయిని అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని చూస్తుందని దుయ్యబట్టారు. బీజేపీ పేద ప్రజల పక్షాన పోరాడుతుందని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాలేదని.. ఒక్కసారి అవకాశం ఇస్తే పేద ప్రజల బతుకులు మారుస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు.