MLA Jaggareddy on Party Change Rumors : పార్టీ మారుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి..! క్లారిటీ ఇదిగో..
🎬 Watch Now: Feature Video
MLA Jaggareddy on Party Change Rumors : కాంగ్రెస్ పార్టీ నుంచి మరో పార్టీలోకి మారుతున్నట్లు తనపై వస్తోన్న వార్తలను ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో (Social Media) తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన నియోజకవర్గ సమస్యలను వివరించడానికి సాధారణ వ్యక్తిలానే తానూ సీఎం కేసీఆర్, మంత్రులను కలవడానికి వెళ్లాలని వివరణ ఇచ్చారు. తనపై వస్తోన్న వార్తలపై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంప్రదాయం బాగోలేదని ఆక్షేపించారు. తనపై తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తన రాజకీయ జీవితం రాహుల్‌గాంధీతోనే ఉంటుందని స్పష్టం చేశారు. సంగారెడ్డిలో రాహుల్ గాంధీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందని.. 50 నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి పార్టీ దరఖాస్తు రుసుం చెల్లింపుపై స్పందించిన ఆయన.. ఏ పార్టీ అయినా దరఖాస్తు రుసుం తీసుకుంటుందని వివరించారు. ఈ విషయంలో మంత్రి హరీశ్‌రావు.. అవగాహన లేక మాట్లాడారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని అందువల్ల ఘర్షణలు సర్వ సాధారణమని చెప్పుకొచ్చారు.