MLA Controversy Video Viral : బోనంతో వస్తే రూ.300.. బతుకమ్మకు రూ. 250.. పాదయాత్రలో ఎమ్మెల్యే ఆఫర్ - మర్రి జనార్ధన్ రెడ్డి పాదయాత్ర వీడియో
🎬 Watch Now: Feature Video
Published : Aug 30, 2023, 1:00 PM IST
|Updated : Aug 30, 2023, 1:20 PM IST
MLA Controversy Viral Exposition Of Padayatra : నాగర్‌కర్నూల్ జిల్లా శాసనసభ్యుడు మర్రి జనార్ధన్ రెడ్డి గత నాలుగు రోజులుగా పదేళ్ల ప్రస్థానంలో మర్రన్న పాదయాత్ర అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పాదయాత్ర చేస్తున్నారు. ఇందులో పాల్గొని బోనాలు ఎత్తే వారికి రూ.300, బతుకమ్మకు రూ.250, నృత్యాలు చేస్తే బీరు ఇస్తామని డప్పు చాటింపు వేయించారు. తెలకపల్లి మండలం రాకొండ, లఖ్నారం గ్రామాల్లోని చాటింపు వీడియో సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతున్నాయి.
కార్యక్రమానికి ముందు రోజు చాటింపు చేయించి... జనార్ధన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రజలను పనులు మానుకొని ఇంటివద్దనే ఉండమని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు.. పాదయాత్రలో బోనాలు ఎత్తితే రూ. 300, బతుకమ్మలతో వచ్చిన వారికి రూ.250 ఇస్తామని ప్రచారం చేయించారు. కార్యక్రమానికి హాజరైన వారికి మరుసటి రోజు డబ్బులు పంచారు. ఇలా డబ్బులతో మందిని తరలించడం, పాదయాత్రలో పాల్గొన్న వారికి డబ్బులు పంపిణీ చేస్తామని దండోరా చేయడం చర్చనీయమైంది.