ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా నన్ను సంప్రదించండి : మంత్రి పొన్నం ప్రభాకర్ - Ponnam At Husnabad
🎬 Watch Now: Feature Video
Published : Jan 6, 2024, 1:11 PM IST
Minister Ponnam Morning Walk in Husnabad Siddipet : హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా, మొహమాటం లేకుండా తనను నేరుగా సంప్రదించవచ్చునని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 14వ వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయపు నడక నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌కు తగు సూచనలు ఇచ్చారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కూరగాయలు అమ్మే చిరు వ్యాపారులతో ముచ్చటించారు. ఆదర్శ, అంబేడ్కర్ హమాలీ సంఘాల కూలీలతో మాట్లాడారు. తనను గెలిపించినందుకు హమాలీ కూలీలకు పొన్నం ధన్యవాదాలు తెలిపారు.
Minister Ponnam At Husnabad Constituency : అందరూ ప్రజా పాలనకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎవరు కూడా తనను సార్ అని పిలవ వద్దని, సహోదరుడిగా భావించి అన్న, తమ్ముడు అని పిలిస్తే సరిపోతుందని మంత్రి పొన్నం అన్నారు. హమాలీ కూలీల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని తెలిపారు. వారి సమస్యల విషయమై వినతి పత్రాన్ని పొన్నం ప్రభాకర్ స్వీకరించారు.