'ప్రజల కోసం పనిజేసిన - నా నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసిన - మళ్లీ గెలిపిస్తే ఇంకా చేస్తా' - మంత్రి మల్లారెడ్డి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video
Published : Nov 22, 2023, 8:07 AM IST
Minister Mallareddy Interview : గత ఐదేళ్లలో వందల పనులు చేశానని.. మళ్లీ గెలిపిస్తే అద్భుతాలు చేసి చూపిస్తానని మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. పనితీరు చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. అందరికంటే మొదటగా ప్రచారాన్ని ప్రారంభించానని.. మిగిలిన పార్టీలు అభ్యర్థులను ప్రకటించినా.. ప్రజల్లో వారికి మంచి మూమెంట్ లేదని అన్నారు. ఈసారి కూడా ప్రజలు తన వైపే ఉన్నారని తెలిపారు. దేశంలో అతిపెద్ద నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గమని.. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయని.. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి జనాలు వచ్చి ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పారు.
అందుకే ఇక్కడ అభివృద్ధి చేయడం కష్టమని... కానీ తాను చేసి చూపించానని తెలిపారు. తన సొంత ఖర్చులతో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలను బాగు చేశానని వెల్లడించారు. మంత్రి అయిన తర్వాత నాలుగు కార్లు ఇచ్చారని.. ఆ కార్లు ఉండగా మళ్లీ కార్లు ఎందుకు కొనుక్కోవడం అని తీసుకోలేదని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న మంత్రి మల్లారెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.