Green Property Show in Hyderabad : హైటెక్స్​లో గ్రీన్​ ప్రాపర్టీ షో.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్​

🎬 Watch Now: Feature Video

thumbnail

KTR Inaugurated green property show : రాష్ట్రంలో హరితహారం కార్యక్రమ ఫలితంగా పచ్చదనం 24 నుంచి 33 శాతానికి పెరిగిందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్స్​లో ఐజీబీసీ, సీఐఐ, తెలంగాణ సర్కారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన గ్రీన్ ప్రాపర్టీ షోను కేటీఆర్ ప్రారంభించారు. కొత్త నిర్మాణాల్లో పచ్చదనం పెంపునకు అవసరమైన ఉపకరణాలు, పర్యావరణహిత బిల్డింగ్​ల రూపకల్పనకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. తెలంగాణ పచ్చదనానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత దాదాపు 200 కోట్ల మొక్కలు నాటామన్నారు. ఈ కార్యక్రమం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నంగా పేర్కొన్నారు. హైదరాబాద్​లోని అనేక కట్టడాలకు గ్రీన్ సర్టిఫికెట్ లభించిందన్న మంత్రి.. పచ్చదనం, భవిష్యత్తు తరాలకు ఇచ్చే అద్భుతమైన కానుక అని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, సీఐఐ, ఐజీబిసి ఛైర్మెన్ శేఖర్ రెడ్డి, యూఏఈ కౌన్సిల్ జనరల్ ఆరిఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సీజీఎం రాజేశ్​ కుమార్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు సాగనున్న ఈ ప్రదర్శనలో దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలకు చెందిన గ్రీన్ రేటెడ్ ప్రాజెక్టుల ప్రతినిధులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.