Minister Koppula on Gurukul Schools :' గురుకుల విద్యార్థులు.. IIT, JEE, NEETలలో సత్తా చాటుతున్నారు' - తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 2023
🎬 Watch Now: Feature Video
Minister Koppula Eshwar on Gurukul Schools in Telangana : వెనుకబడిన వర్గాల విద్యార్థులందరికీ ఉన్నతమైన విద్యనందించటమే లక్ష్యంగా ప్రత్యేక సకల సదుపాయాలతో గురుకుల పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. శాసనసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తూ పాఠశాలలను చక్కగా నడుపుతున్నామని తెలియజేశారు. 731 గురుకులాలను.. కొత్త వాటితో కలిపి మొత్తంగా వెయ్యి 22 గురుకుల పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో గతంలో పదో తరగతి వరకే ఉండేదని... ప్రస్తుతం డిగ్రీ వరకు చదువుకునే అవకాశమే కాకుండా ప్రత్యేక కోర్సులను ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. మహిళల కోసం 30 కళాశాలలను స్థాపించామని.. 38 సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ ద్వారా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నామని పేర్కొన్నారు. ఒకప్పుడు గురుకులాల్లో చదువుకున్న వారి సంఖ్య లక్ష మంది ఉండగా అది ఇప్పుడు 6 లక్షల 10వేలకు చేరిందని వివరించారు. గురుకులాల్లో చదవుకున్న విద్యార్థులు ఎంబీబీఎస్, ఐఐటీ, నీట్ లాంటి పరీక్షల్లో సత్తా చాటడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.