జుక్కల్‌లో మంత్రి జూపల్లి పర్యటన - కౌలస్‌కోటను అభివృద్ధి చేస్తామని హామీ

🎬 Watch Now: Feature Video

thumbnail

Minister Jupally visit Koulash Kota in Jukkal : ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్‌ అప్పులకుప్పగా మార్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. నియోజకవర్గంలోని కౌలస్‌కోటను సందర్శించారు. కోటకు సంబంధించిన చరిత్ర, పూర్వపరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. 

Minister Jupally Fires on KCR : ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ పాలనలో జుక్కల్‌ నియోజవర్గంలో అభివృద్ధి జరగలేదన్నారు. ఎల్లారం తాండా గూగుల్‌ మ్యాప్‌లో కనిపించడం లేదని, ఎక్కడ చూసిన దుమ్ము దర్శనమిస్తోందన్నారు. గత పాలనలో ఏడు లక్షల కోట్లు అప్పు చేశారని, వడ్డీలకే వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. ప్రజాపాలనను అందరూ వినియోగించుకోవాలని సూచించారు. జుక్కల్‌ నియోజకవర్గంలోని కౌలస్‌కోటను పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మంత్రి నియోజకవర్గ పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు, కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధుశర్మ తదితర అధికారులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.