Minister Harish Rao Reacts on Raithu Bandhu : "కాంగ్రెస్​ వచ్చిందంటే.. పథకాలకు ఇక రాంరాం" - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 26, 2023, 4:21 PM IST

Updated : Oct 26, 2023, 4:39 PM IST

Minister Harish Rao Reacts on Raithu Bandhu : రైతుబంధు పథకం.. ఓట్ల కోసం తెచ్చిన పథకం కాదని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయని రైతుబంధు నిధులు ఇవ్వొద్దని.. కాంగ్రెస్​ నాయకులు ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేశారన్నారు. కాంగ్రెస్‌ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వమని.. కాంగ్రెస్​ వచ్చిందంటే రైతు పథకాలకు ఇక రాంరాం చెబుతారని అని ఎద్దేవా చేశారు. రైతులంతా బీఆర్ఎస్​ వెంటే ఉన్నారని.. కాంగ్రెస్‌ పార్టీ రైతులపై కోపం పెంచుకుందని ధ్వజమెత్తారు. 

Congress Complaints EC on Raithu Bandhu Funds : కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు రైతులు బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో హయాంలో.. రాష్ట్రంలో రోజూ రైతుల ఆత్మహత్యలు ఉండేవని పేర్కొన్నారు.  కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే... రైతుబంధు ఉండదని, మళ్లీ కరెంట్​ కష్టాలు వస్తాయన్నారు. తెలంగాణ రైతుబంధునే కేంద్రంలో మోదీ సర్కార్‌ కాపీ కొట్టిందని తెలిపారు. తెలంగాణలోని చాలా పథకాలను కేంద్రం, ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టాయన్నారు. కరోనా సమయంలో సీఎం కేసీఆర్​.. ఎమ్మెల్యేలు, అధికారుల జీతాల్లో కోత పెట్టి రైతుబంధు ఇచ్చారన్నారు. బీఆర్​ఎస్​ మళ్లీ గెలిస్తే... రైతుబంధును రూ.16 వేలకు పెంచుతామని స్పష్టం చేశారు.  

Last Updated : Oct 26, 2023, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.