చిన్నారులతో స్వీట్ షాప్‌నకు వెళ్లిన తండ్రి.. బైక్ దిగేలోపే ఢీకొట్టిన మినీ వ్యాన్.. అంతలోనే.. - తమిళనాడులో రోడ్డు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
Mini Luggage Van Collides With Bike : తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో బైక్‌ను ఢీకొట్టింది ఓ మినీ లగేజ్ వ్యాన్. ఘటనలో తండ్రీకూతురు తీవ్రంగా గాయపడ్డారు. మిగతా వాహనాలను ఓవర్ టేక్ చేసే క్రమంలో.. బైక్‌ను మినీ లగేజ్ వ్యాన్ ఢీకొట్టినట్లు తెలుస్తోంది. మెట్టుపాళయం పట్టణంలో సోమవారం రాత్రి ఘటన జరిగింది.
తండ్రీకూతుళ్లకు తీవ్ర గాయాలు..
ఓ వ్యక్తి నలుగురు చిన్నారులను బైక్‌పై ఎక్కించుకుని మీనాక్షి ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఐస్‌క్రీమ్ షాప్‌కు వెళ్లాడు. సరిగ్గా చిన్నారులు బైక్ దిగే సమయంలోనే అతివేగంతో వచ్చిన మినీ లగేజ్ వ్యాన్ వారిని ఢీకొట్టింది. దీంతో తండ్రీకూతురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనంతరం అప్రమత్తమైన స్థానికులు.. వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. ఎదురుగా ఉన్న ఓ కారు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదానికి కారణమైన వ్యాన్.. మెట్టుపాళయం కరమడై వైపు వెళుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.