మిల్లెట్స్‌తో 6750కిలోల కిచిడీ తయారీ- విద్యార్థులకు పంపిణీ- అయోధ్యలో 8వేల కిలోల హల్వా! - విష్ణు మనోహర్ చెఫ్
🎬 Watch Now: Feature Video
Published : Jan 5, 2024, 10:03 PM IST
Millet Khichdi Recipe Maharashtra : తృణధాన్యాలతో 6750 కిలోల కిచిడీని తయారుచేశాడు మహారాష్ట్రకు చెందిన విష్ణు మనోహర్ అనే చెఫ్. మిల్లెట్ల ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఇంత భారీ మొత్తంలో చంద్రాపుర్లో కిచిడీ తయారుచేశానని చెప్పాడు. ప్రధాని నరేంద్ర మోదీ 2023వ సంవత్సరాన్ని మిల్లెట్ ఇయర్‌గా ప్రకటించిన నేపథ్యంలో తాను ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చెప్పాడు విష్ణు.
ప్రధాని మోదీ పిలుపు మేరకు మహారాష్ట్రలోని 12 ముఖ్యమైన నగరాల్లో భారీ మొత్తంలో తృణధాన్యాలతో కిచిడీని తయారుచేయాలని నిర్ణయించుకున్నానని చెఫ్ విష్ణు మనోహర్ తెలిపాడు. ఇప్పటికే నాగ్‌పుర్, నాసిక్, ఔరంగాబాద్‌లో భారీ మొత్తంలో కిచిడీ తయారుచేశానని చెప్పాడు. నాగ్‌పుర్‌లో 6500 కిలోల కిచిడీని తయారుచేసిన విష్ణు తాజాగా చంద్రాపుర్లో 6750 కిలోల కిచిడీ వండి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. అయితే చంద్రాపుర్‌లోని పాఠశాలల్లోని విద్యార్థులకు, స్థానిక రైతులకు ఈ కిచిడీని పంచాడు విష్ణు మనోహర్. మరోవైపు, అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా 8వేల కిలోల హల్వాను తయారుచేస్తానని విష్ణు చెప్పాడు.