"ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా" ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం - హైదరాబాద్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Almond Board of California: ఆరోగ్యమే మహాభాగ్యం.. దీనిని మించిన సంపద అంటూ ఏమీ లేదు. నేటి కాలం ఉరుకుల పరుగుల జీవితంలో మారిన లైఫ్ స్టైల్లో ఎటువంటి ఆహారం తీసుకుంటే పూర్తి ఫిట్నెస్తో ఉంటారు. ఆయుర్వేదం, న్యూట్రిషనల్ సైన్స్‌తో సంపూర్ణ ఆరోగ్యం పొందడం ఎలా అనే అంశంపై ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంచి స్ఫందన లభించింది. ఈ సమావేశంలో సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ కిరణ్ డెంబ్లా, న్యూట్రిషన్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి, ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నితిక కోహ్లీ చర్చలో తదితరులు పాల్గొన్నారు.
బాదాంలను ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలపై చర్చించారు. ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యుల మెరుగైన ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. ఇందుకోసం నిత్యం ఆహారంలో బాదాంలను ఏదో ఒక రూపంలో తీసుకోవాలని సూచించారు. బాదాంలను నిత్యం తీసుకోవటం వల్ల గుండె సంబంధిత జబ్బులు వచ్చే సమస్య తగ్గే అవకాశం ఉందన్నారు. అందరూ తప్పకుండా బాదాంలను మెనూలో చేర్చుకోవాలని సూచించారు.