ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రచారాన్ని అడ్డుకున్న యువకుడు, దాడి చేసిన బీజేపీ నాయకులు - బీజేపీ ఎన్నికల ప్రచారాలు
🎬 Watch Now: Feature Video
Published : Nov 14, 2023, 7:32 PM IST
Clash Between BJP And BRS Leaders In Medak : ఎన్నికల పోలింగ్‌కు మరో 16 రోజులే గడువు ఉండడంతో.. నేతలందరూ ప్రచారాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే పోటాపోటీగా ప్రజల్లోకెళ్తున్న పార్టీలు అధికారం అప్పగిస్తే.. చేపట్టే అభివృద్ధి, సంక్షేమంపై విస్తృతంగా చర్చిస్తున్నారు. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది.
Raghunandan Rao Campaighn In Medak : రుక్మాపూర్ గ్రామంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వచ్చారు. ఈ క్రమంలో రఘునందన్ రావు మాట్లాడుతున్న సమయంలో దినేష్ అనే యువకుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడున్న బీజేపీ నాయకులు అతనిపై దాడి చేశారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. నాయకులకు మద్యం తాగించి గొడవలు సృష్టించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందని రఘునందన్ రావు ఆరోపించారు.