బీఆర్ఎస్ నేతలు, కార్పొరేటర్లకు తన పేరుతో బెదిరింపు ఫోన్‌కాల్స్ చేస్తున్నారు : మర్రి రాజశేఖర్‌రెడ్డి - బీఆర్ఎస్ నాయకులకు బెదిరింపు కాల్స్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-12-2023/640-480-20219669-thumbnail-16x9-marri-rajashekar-reddy.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Dec 8, 2023, 9:58 PM IST
Malkajgiri MLA Complaint on Threatening Calls : గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లకు తన పేరుతో బెదిరింపు కాల్స్ చేస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకోవాలని నేరేడ్మెట్లోని రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.
BRS MLA Marri Rajasekhar Reddy Complaints on Spoof Calls : కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీఆర్ఎస్ నేతలకు, కార్పొరేటర్లకు తన పేరుతో స్పూఫ్ కాల్స్ చేస్తున్నారని మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతల కుటుంబాలను నాశనం చేస్తామని, భార్యబిడ్డలను చంపుతామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచినందుకు తమపై కొందరు నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. తమకు వచ్చిన బెదిరింపు కాల్స్‌ను రికార్డు చేశామని త్వరలో మీడియాకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విషయమై సీపీకి ఫిర్యాదు చేశామని త్వరలో దుండగులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారని చెప్పారు.