maharastra farmers visits secretariat: 'రైతుల పాలిట నాయకుడు కేసీఆర్'.. సచివాలయాన్ని సందర్శించిన మహారాష్ట్ర రైతులు - సెక్రటేరియట్‌కు వచ్చిన మహారాష్ట్ర రైతులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18476757-thumbnail-16x9-maha.jpg)
maharastra farmers visits secretariat: తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని మహారాష్ట్ర కిసాన్ సంఘటన్ ప్రతినిధులు ప్రశంసించారు. హైదరాబాద్‌లో నిన్న(బుధవారం) ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమైన కిసాన్ సంఘటన్ ప్రతినిధులు.. ఇవాళ సచివాలయాన్ని సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశానికి రోల్ మోడల్ అని.. రాష్ట్రంలో సాగు, తాగు నీటి ప్రాజెక్టులు అద్భుతమని కొనియాడారు.
సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం గొప్ప విషయమని అన్నారు. దేశానికి తెలంగాణ మోడల్ అవసరమన్న కిసాన్ సంఘటన ప్రతినిధులు... దేశంలో రైతులు, పేద, అణగారిన వర్గాల నాయకుడు కేసీఆర్ మాత్రమే అని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ పథకాలు అమలు చేయాలని మహారాష్ట్ర ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను మహారాష్ట్రలోని ప్రతి గడపకు చేరవేస్తామని పేర్కొన్నారు. 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అన్న నినాదాన్ని కేసీఆర్ చెప్తున్నారని... మహారాష్ట్రలో రానున్నది బీఆర్ఎస్ అని కిసాన్ సంఘటన్ ప్రతినిధులు తెలిపారు.