MahaBahubali Pumps Palamuru Rangareddy Project : మహాబాహుబలి పంపులు.. నీటిని ఎలా ఎత్తిపోస్తాయో తెలుసా..?
🎬 Watch Now: Feature Video
MahaBahubali Pumps Palamuru Rangareddy Project : రికార్డులను తిరగరాస్తూ మహాబాహుబలి పంపులు నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉపయోగించిన పంపుల సామర్థ్యాన్ని మించిన భారీ పంపులు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల్లో (Palamuru Rangareddy Lift Irrigation) ప్రారంభం కానున్నాయి. ఏకంగా 145 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మోటార్లు, రోటర్లను ఇక్కడ వినియోగిస్తున్నారు. 550 టన్నుల భారీ బరువున్న ఈ పంపులను హార్స్ పవర్స్‌లో చూస్తే ఒక్కొక్కటి దాదాపు 1,95,000ల హెచ్‌పీలతో సమానం. ఇప్పటికే ఏదుల పంపులు డ్రైరన్ పూర్తి చేసుకున్నాయి.
Palamuru Rangareddy MahaBahubali Motors : పంపులతోపాటు, విద్యుత్ వ్యవస్థ, గేట్లు, ఉష్ణోగ్రతలు, విద్యుత్ సరఫరా.. ఇలా ప్రతి పనిలోనూ మానవ రహిత వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా స్కాడా పేరుతో రూపొందించిన సాంకేతిక వ్యవస్థను నీటిపారుదల శాఖ వినియోగిస్తోంది. అంత భారీ సామర్థ్యం కలిగిన పంపుల నిర్మాణం ఎలా ఉంటుంది?.. అవి ఎలా పనిచేస్తాయి?.. తదితర వివరాలపై ఎంతో ఆసక్తి ఉంటుంది. పంపుల వెట్ రన్ శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జరగనున్న తరుణంలో.. మహాబహుబలి పంపుల నిర్మాణం, పనితీరుపై ప్రత్యేక కథనం.