Live video on cell phone theft : కస్టమర్‌గా వచ్చాడు.. ఫోన్ దొంగిలించాడు.. కానీ ఇంతలో ఏం జరిగిందంటే..? - CCTV footage of thefts
🎬 Watch Now: Feature Video
Live video of cell phone theft at Karimnagar : దుకాణాలు, జన సముహాలు ఉండే ప్రదేశాల్లో జాగ్రత్త సుమీ..! మీ చుట్టు మీకు తెలియకుండనే కేటుగాళ్లు మాటు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. అంతే సంగతులు.. మిమ్మల్ని నిలువు దోపిడి చేసి అటు నుంచి అటుగా పరారైపోతారు. అచ్చం ఇలాంటి తరహాలోనే కరీంనగర్లో ఓ చోరీ జరిగింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వెంటనే ఆ దొంగను సీసీ కెమెరాలు పట్టించాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మహమ్మద్ ఇర్ఫాన్ అనే వ్యక్తి కరీంనగర్లో ఆటో నడుపుతూ తరచు దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఈ క్రమంలోనే ఇవాళ రాంనగర్‌లోని ఓ దుకాణంలో ఎవరు లేని సమయం చూసి తన చేతికి పనిచెప్పాడు. కౌంటర్ దగ్గర ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంతలో షాపు యజమాని తన సెల్‌ఫోన్ అక్కడ లేకపోవడంతో తన షాపులో ఉన్న మూడో నేత్రం.. సీసీ కెమెరాను పరిశీలించారు. ఇంకేముంది వెంటనే దొంగను గుర్తించారు. వెంబడించి పట్టుకొని దేహాశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.