MLA Sudheer Reddy Basti Bathakhani : ప్రజా సమస్యల పరిష్కారానికి MLA సుధీర్‌రెడ్డి 'బస్తీ బాతాఖానీ' - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
MLA Sudheer Reddy Basti Bathakhani : ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన్సూరాబాద్ డివిజన్లోని వీరన్నగుట్ట కాలనీలో.. బస్తీ బాతాఖానీ (బస్తీ నిద్ర) కార్యక్రమాన్ని స్థానిక రామాలయంలో పూజలు నిర్వహించి ప్రారంభించారు. స్థానిక వీరన్నగుట్టతో పాటు పరిసర కాలనీల్లో ఆయా సంబంధిత అధికారులతో కలిసి తిరుగుతూ ప్రజలను పలకరించి సమస్యలపై ఆరా తీశారు.
రేపు ఉదయం 6 గంటల వరకు కాలనీలో పరిస్థితులను పరిశీలించి.. కాలనీవాసుల సమస్యలను పరిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయో లేదో తెలుసుకుంటానని అన్నారు. ఇప్పటికే తాగు నీరు, విద్యుత్‌దీపాలు, డ్రైనేజీ మొదలగు అభివృద్ధి పనులు చేసినట్లు, రోడ్ల సమస్యలు ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తానని చెప్పారు. దశల వారీగా ప్రజా సమస్యలను అన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా సంబంధిత అధికారులతో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.